భారతదేశంలో లింగం మరియు పేరును ఎలా మార్చుకొవాలి
మన ట్రాన్సజెండర్ స్నేహితుల ద్వారా భాగస్వామ్యం చేసిన కొన్ని వ్యక్తిగత సంఘటనలు / అనుభవాలు మినహా, పేరు మరియు లింగం చట్టపరమైన మార్పు ప్రక్రియ, మీకు మార్గనిర్దేశం చేసే పూర్తి ఆన్లైన్ వివరణ లేదు. నా సొంత వ్యక్తిగత అనుభవం నుండి నేను కొంత సమయం మరియు ఇబ్బంది కాపాడడానికి ఈ గైడ్ తయారు చేసాను. పేరు మరియు లింగాం యొక్క చట్టపరమైన మార్పు మూడు దశల ప్రక్రియ. నామంగా,
1. అఫిడవిట్ (Affidavit) పొందుట 2. వార్తాపత్రిక (Newspaper) ప్రకటన ప్రచారన 3. గెజెట్‌ను(Gazette) తెలియజేయుట.
1. అఫిడవిట్ పొందుట
ఒక నోటరి నుండి పేరు మరియు లింగ మార్పిడి కోసం ఒక అఫిడవిట్ పొందండి. వారు సాధారణంగా సుమారు 300 రూపాయల వసూలు చేస్తారు. మీ సూచన కోసం నమూనా ప్రమాణపత్రం ఇక్కడ అందుబాటులో ఉంది Affidavit .
2. వార్తాపత్రిక ప్రకటన ప్రచారన
వార్తాపత్రిక ప్రకటన ప్రచారన కొరకు మీకు నచ్చిన వార్తపత్రిక ఎంపిక చేసుకోండి మరియు ప్రకటన ప్రచారన చేయడానికి అఫిడవిట్ కాపీని సమర్పించండి. మీరు సులభంగా http://www.releasemyad.com ద్వారా మీ ఇంటి సౌకర్యం నుండి, చాలా సులభంగా ఆన్లైన్లోచేయవచ్చు. మీరు దీన్ని రహస్యంగా చేయాలనుకుంటే, తక్కువ జనాదరణ పొందిన వార్తాపత్రికను ఎంచుకోండి మరియు ఇది మీకు కొన్త డబ్బు కూడా సేవ్ చేస్తుంది. మామూలుగా ప్రకటన 300 నుండి 500 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ప్రకటన ఎలా కనిపిస్తుందో మీకు ఒక ఆలోచన ఇవ్వడానికి, నేను ఇక్కడ ఒక టెంప్లేట్‌ను జోడించాను Newspaper template.
3. గెజెట్‌ను తెలియచేయుట
చివరి దశలో పేరు మరియు లింగ మార్పును గెజెట్‌లో తెలియజేయాలి. గెజెట్ ప్రభుత్వం యొక్క అధికారిక పత్రిక వలె ఉంటుంది. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు తమ స్వంత గెజెట్లను కలిగి ఉన్నాయి. గెజెట్లలో ఏదో ఒకదానికి తెలియజేయగలవు కాని అనేక ప్రభుత్వ / పాక్షిక ప్రభుత్వ సంస్థలు భారతదేశ గెజెట్‌లో తెలియజేయాలని పట్టుబట్టాయి. ప్రైవేటు వ్యక్తుల నుండి ప్రకటనలు మరియు పబ్లిక్ నోటీసులు సాధారణంగా భారతదేశం యొక్క గెజెట్ పార్ట్– IV లో ప్రచారించబడుతాయి. నేను భారతదేశం యొక్క గెజెట్‌లో పేరు & లింగం మార్పు తెలియజేయడానికి విధానం వివరిస్తూ ఉంటాను. తెలియని వారికి చట్టపరంగా పేరు మరియు లింగ మార్పిడి కొరకు ఏ శస్త్రచికిత్స / చికిత్స(Surgery or treatment) అవసరం లేదు కారణం Supreme court యొక్క NALSA తీర్పు.
గెజెట్ నోటిఫికేషన్ కోసం, క్రింది పత్రాలను సమర్పించాలి.
1. పేరు మిరియు లింగం మార్చడం కోసం అఫిడవిట్ యొక్క కాపీ. (Notarized Affidavit)
2. దరఖాస్తుదారుచే సంతకం చేయబడిన ఒక ఒప్పందం. (Duly signed Undertaking)
3. అసలైన వార్తాపత్రిక. (Original Newspaper)
4. అభ్యర్థి మరియు రెండు సాక్షుల సంతకాలతో సరిగ్గా టైప్ చేయబడిన నకిలీ సూచించిన ధృవీకరణ. (Proforma)
5. MS Word లో సాక్షి భాగం లేకుండా మరియు సంతకం స్థానంలో టైప్ చేసిన పాత పేరు తోని ముద్రణ పదార్థాన్ని (Proforma) కలిగి ఉన్న C.D. (C.D Proforma)
6. రెండు స్వయ ధృవీకరించబడిన పాస్‌పోర్ట్ సైజు ఫోటో మరియు స్వయ ధృవీకరించబడిన ID Proof ఫోటోకాపీ. (Two Self attested photographs and self attested photocopy of ID proof)
7. హార్డ్ కాపీ మరియు సాఫ్ట్ కాపీ యొక్క సారాంశం అదే అని దరఖాస్తుదారు సంతకం చేసిన సర్టిఫికెట.(Certificate)
8. కొరియర్/ పోస్టు ద్వరా పంపితే అభ్యర్థన ఉత్తరం తోపాటు ఢిల్లీలో చెల్లించవలసిన “పబ్లిషర్స్ యొక్క కంట్రోలర్” కు, 1100/- డిమాండ్ డ్రాఫ్ట్ సమర్పించాలి. (Request Letter with requisite fee)
9. Gender Dysphoria లేదా Sex Reassignment Surgery వైద్య సర్టిఫికెట యొక్క కాపీ.
(Medical Certificate)
10. SRS ఐన వ్యక్తుల కోసం సెక్స్ మార్పుకు సంబంధించి Specimen Proforma. (ఇది తప్పనిసరి కాదు)
ఒకరు వ్యక్తిగతంగా పత్రాలను సమర్పించవచ్చు లేదా పోస్ట్ / కొరియర్ ద్వారా పంపవచ్చు. పోస్ట్ ద్వారా కాకుండా వాటిని వ్యక్తిగతంగా (ప్రాసెస్ చేయడానికి తక్కువ సమయం పడుతుంది) సమర్పించడం మంచిది. అలాగే, పోస్టు / కొరియర్ ద్వారా పంపిన దరఖాస్తులు ప్రాసెస్ కొరకు కనీసం 2 నెలలు పడుతుంది. గెజెట్ సాధారణంగా ప్రతి శనివారం ప్రచారించబడుతుంది మరియు ఇది వెబ్సైట్ చిరునామా నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు egazette.nic.in
భారతదేశం యొక్క గెజెట్ గురించి మరింత సమాచారం కోసం, దయచేసి అధికారిక వెబ్సైట్ deptpub.nic.in వద్ద తనిఖీ చేయండి.
అఫిడవిట్, వార్తాపత్రిక ప్రకటన మరియు గెజెట్ నోటిఫికేషన్ యొక్క కాపీలతో, మీరు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటరు కార్డు, కంపెనీ ID వంటి ఇతర ID లు మార్చవచ్చు.
ఈ గెజెట్ నోటిఫికేషన్ ఆధారంగా విద్యా సర్టిఫికేట్లు కూడా మార్చవచ్చు. కర్ణాటకలోని విశ్వేశ్వరయ్య టెక్నాలజీ యూనివర్శిటీ జారీ చేసిన డిగ్రీ సర్టిఫికేట్ల కోసం, మీరు పేరు మరియు లింగ మార్పు కోసం గజెట్ ఆధారంగా VTU పేరు దిద్దుబాటు రూపం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మీరు సంబంధిత రుసుములను ఆన్లైన్లో చెల్లించాలి మరియు నింపిన దరఖాస్తును మీ కళాశాల ద్వారా VTU కు పంపించాలి.
PS: 2 ఏళ్ళపాటు స్రమతో చట్టపరంగా పొరాటం చేసిన Ms Kritika singh (Board Member of Transgenderindia) కు మా కృతగ్నతలు. ఇప్పుడు భారతదేశంలో ట్రాన్స్ జెండర్ ప్రజలు Surgery/HRT లేకుండా లింగ మరియు పేరును చట్టబద్ధంగా మార్చవచ్చు.